అల్లు అర్జున్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పనితీరును మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాడు. దశాబ్ద కాలపు వారి కెరీర్లో ఈ ద్వయం రెండు సార్లు కలిసి పనిచేసిన వీరి మధ్య భాంధవ్యాన్ని అల్లు అర్జున్ గుర్తుచేసుకున్నాడు. ఈ నెల 31న విడుదల కాబోతున్న ‘ఇద్దరమ్మాయిలతో.. ‘ సినిమాలో అందరి కళ్ళూ అల్లు అర్జున్ పైనే వున్నాయి. అతను ఇప్పటికే ‘జులాయి’ సక్సెస్ తో జోరుమీద వున్నాడు.
తన కెరీర్లోనే ‘ఇద్దరమ్మాయిలతో.. ‘అత్యంత స్టైలిష్ చిత్రమని అల్లు అర్జున్ ఇప్పటికే పలుసార్లు ఇంటర్వ్యూలో తెలిపాడు. హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చెయ్యడంలో పూరిని మించిన వారు లేడని తెలిపాడు. ‘ఒక నటుడిలో వున్న ఉత్తమమైన నటనను బయటకు తీసుకురావాలంటే డైరెక్టర్ కు, యాక్టర్ కు మధ్య బలమైన బంధం ఉండాలి. ‘ఇద్దరమ్మాయిలతో.. ‘ సినిమా ఫలితం ఎలా వున్నా ఇది పక్కా పూరి స్టైల్లో సాగే స్టైలిష్ సినిమా’ అని అల్లు అర్జున్ తెలిపాడు. ఈ సినిమాలో అమల పాల్, కేథరీన్ హీరోయిన్స్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. బండ్ల గణేష్ నిర్మాత