పవన్ అభిమానులకు అండగా అల్లు అర్జున్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్న చిత్తూరు ప్రాంతంలో ఫ్లెక్స్ కడుతూ అకస్మాత్తుగా విద్యుత్ ఘాతానికి లోను కావడంతో ముగ్గురు మరణించగా మరికొంత మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఈ వార్త ఎంతగానో మన హీరోలను కదలించివేసింది. దీనిపై మెగాస్టార్ చిరు, పవన్ సహా ఎందరో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

అలాగే పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ యూనిట్ కూడా వారి కుటుంబాలకు 2 లక్షలు చొప్పున సాయం చేస్తామని తెలిపారు. అలాగే వీరితో పాటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దృష్టికి కూడా ఈ అంశం రావడంతో తాను కూడా సాయం చెయ్యడానికి ముందుకొచ్చి ఆర్ధికంగా ఆడుకుంటా అని హామీ ఇచ్చారు. తాను కూడా వారి కుటుంబాలకు 2 లక్షలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తాని తెలిపారు. దీనితో బన్నీ కల్మషం లేని గొప్పదనం మరోసారి నిరూపితం అయ్యిందని చెప్పాలి.

Exit mobile version