బండ్లగూడలో ‘యాక్షన్’ చేస్తున్న అల్లరి నరేష్

బండ్లగూడలో ‘యాక్షన్’ చేస్తున్న అల్లరి నరేష్

Published on Apr 12, 2012 9:52 AM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ తాజాగా నటితున్న ‘యాక్షన్’ అనే 3D చిత్రం ప్రస్తుతం బండ్లగూడలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. గత సంవత్సరం దూకుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. ఈ షెడ్యుల్ ఇటీవలే ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిక్ శ్యాం, వైభవ్, రాజుసుందరం నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో స్నేహా ఉల్లాల్, కామ్న జెఠ్మలాని నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అల్లరి నరేష్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహరి గారి అబ్బాయి బప్ప లహరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నాడు.

తాజా వార్తలు