కామెడీ కింగ్ అల్లరి నరేష్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ సినిమాలోని హీరో హీరోయిన్ మరియు కీలక పాత్రలని పరిచయం చేయడం కోసం అల్లరి నరేష్ తన వాయిస్ అందించాడు. ఈ నెల 29న విడుదల కావడానికి సిద్దమవుతున్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ నిర్మించారు.
సందీప్ కిషన్, రాకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఇండస్ట్రీ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. గాంధీ మేర్లపాక ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తాయని గాంధీ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రమణ గోగుల మ్యూజిక్ అందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి చోట కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా, గౌతం రాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.