వేసవి సీజన్ ని అరభించనున్న అల్లరి నరేష్

Allari-Naresh-shooting-at-G
కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఈ ఏడాది వేసవి సీజన్ ని “యాక్షన్ 3D” చిత్రంతో ప్రారంభించనున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టనుంది. ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యింది. ఈ చిత్రంలో ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది నరేష్ ఈ వేసవిలో ఈ చిత్రంతో పాటు మరో చిత్రంతో కూడా ప్రేక్షకులను నవ్వించనున్నారు. నరేష్ ప్రధాన పాత్రలో రానున్న “కెవ్వు కేక” అనే చిత్రం కూడా వేసవిలోనే విడుదల కానుంది. అనిల్ సుంకర దర్శకత్వంలో రానున్న “యాక్షన్ 3D” చిత్రం తొలి కామెడి 3D చిత్రం కానుంది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు బప్పా లహరి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version