గంధర్వ మహల్లో యాక్షన్ చేస్తున్న అల్లరోడు

గంధర్వ మహల్లో యాక్షన్ చేస్తున్న అల్లరోడు

Published on Nov 21, 2012 11:32 AM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ కెరీర్లో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘యాక్షన్ 3డి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని గంధర్వ మహల్లో జరుగుతోంది. ఈ ‘గంధర్వ మహల్’ సెట్ ని లక్ష్మీ మంచు తను నిర్మించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమా కోసం వేసారు. ఈ రాజ మహల్ ని ప్రస్తుతం మిగతా సినిమాల షూటింగ్స్ కోసం వాడుతున్నారు మరియు ‘యాక్షన్ 3డి’ టీం కూడా కొన్ని సన్నివేశాల కోసం ఈ సెట్ ని వాడుకుంటున్నారు.

‘కిక్’ శ్యాం, వైభవ్ మరియు రాజు సుందరం ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ్ మరియు కామ్న జఠ్మలాని హీరోయిన్స్ గా చేస్తున్నారు. అనిల్ సుంకర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. బప్పి లహరి మరియు బప్పా లహరి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎస్.ఎస్ తమన్ అందిస్తున్నారు.

తాజా వార్తలు