బాలయ్య అసిస్టెంట్ గా అల్లరి నరేష్ !

బాలయ్య అసిస్టెంట్ గా అల్లరి నరేష్ !

Published on Sep 14, 2020 6:59 AM IST

బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా నుండి తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బాలయ్య అసిస్టెంట్ పాత్ర ఒకటి ఉందని… జస్ట్ అసిస్టెంట్ రోల్ అయినా, ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ రోల్ కాస్త కీలకమైనది అని.. అలాగే ఈ రోల్ నుండే ఫన్ జనరేట్ అవుతుందని తెలుస్తోంది. అందుకే కొంచెం ఫేమ్ ఉన్న హీరో అయితే బెటర్ అని ఈ రోల్ కోసం అల్లరి నరేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.

మరి బాలయ్య సినిమాలో అసిస్టెంట్ పాత్ర చేయడానికి అల్లరి నరేష్ ముందుకు వస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

తాజా వార్తలు