టాలెంటెడ్ హీరో “అల్లరి” నరేష్ కోసం మన తెలుగు ఆడియెన్స్ కు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ఈ టాలెంటెడ్ నటుడు ఇప్పుడు ఒక సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రను అయినా చేయగలిగి ఒక వెర్సిటైల్ నటుడు అనిపించుకోవాలని చేసిన ప్రయత్నమే “నాంధి”. కంప్లీట్ గా కొత్త కోణం మరియు కథతో అల్లరి నరేష్ చేసిన ప్రయోగాత్మక చిత్రం ఇది.
అయితే ఇది లైన్ లో ఉండగానే మరో కామెడీ చిత్రాన్ని కూడా అల్లరి నరేష్ చేసాడు. అదే “బంగారు బుల్లోడు”. ఈ ఏడాదిలో గత కొన్ని రోజుల కితమే విడుదల కాబడిన ఈ చిత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. దీనితో ఈ గ్యాప్ లోనే తన నెక్స్ట్ చిత్రం “నాంధి”తో మళ్ళీ తన అదృష్టం పరీక్షించుకోడానికి సిద్ధం అవుతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంను ఈ ఫిబ్రవరి 19నే విడుదల చెయ్యడానికి కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈసారి అయినా నరేష్ కు మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.