రామోజీ ఫిలింసిటీ లో సందడి చేస్తున్న అల్లరి నరేష్ – భూమిక

రామోజీ ఫిలింసిటీ లో సందడి చేస్తున్న అల్లరి నరేష్ – భూమిక

Published on Sep 6, 2013 2:30 AM IST

Allari-Naresh-and-Bhumika
కామెడీ కింగ్ అల్లరి నరేష్, ప్రస్తుతం రవిబాబు దర్శకత్వం లో వస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో ఉన్నాడు . ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీ లో జరుగుతుంది, ఈ షెడ్యూల్ ఈ నెల 20 వరకు జరగవచ్చు . ఈ సినిమా లో నరేష్ బాగా లావుగా ఉండే ముసలి వ్యక్తి లా కనిపించనున్నాడు . దీనీ కోసం లండన్ నుంచి వచ్చిన మేకప్ నిపుణులు పనిచేస్తున్నారు .

ఈ సినిమా లో భూమిక హీరోయిన్ గా నటిస్తుంది . ఈ కామెడీ ఎంటర్టైనర్ ని త్రిపురనేని రాజేంద్ర నిర్మిస్తున్నారు.అల్లరి నరేష్, రవిబాబు ల కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం వచ్చిన “అల్లరి”, నరేష్ కి టర్నింగ్ పాయింట్ కాగా అప్పటినుంచి నరేష్, “అల్లరి నరేష్” గా మారిపోయాడు .స్టైలిష్ టేకింగ్ తో, విబిన్న కదాంశాలతో తనదైన శైలి ని సృష్టించుకున్న దర్శకుడు రవిబాబు . ఈ సినిమా నవ్వుల పంట పండిస్తుందని అందరి అంచనా .

తాజా వార్తలు