స్టార్ కపుల్ డిసెంబర్ లో పెళ్లి చేసుకుంటారట

బాలీవుడ్ స్టార్ కపుల్ రన్బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి చుకోనున్నారు. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర విడుదల అనంతరం వీరు పెళ్లి చేసుకోనున్నారట. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. విడుదల అనంతరం కొద్దిరోజులలో అనగా డిసెంబర్ లోనే ఈ జంట ఒక్కటి కానున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రాకున్నటప్పటికీ బాలీవుడ్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాధానం

ఇక అలియా బ్రహ్మాస్త్ర సినిమాతో పాటు, సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ గంగూభాయి కథియవాడి చిత్రంతో పాటు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ఆమె అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న చరణ్ కి జంటగా నటిస్తుంది. ఈ చిత్రం 2021 జనవరి 8న విడుదల కానుంది.

Exit mobile version