ఆర్ ఆర్ ఆర్ నుండి అలియా అవుట్…అసలు నిజం ఇదే?

ఆర్ ఆర్ ఆర్ నుండి అలియా అవుట్…అసలు నిజం ఇదే?

Published on Jun 26, 2020 9:05 PM IST

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలు కావాల్సి ఉండగా…కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా వాయిదా వేశారు. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన సీరియల్స్ షూటింగ్స్ కారణంగా కొందరు నటులు ఈ వైరస్ బారిన పడ్డారు. దీనితో షూటింగ్ నిర్వహించుట అంత శ్రేయస్కరం కాదని ఆర్ ఆర్ ఆర్ టీమ్ భావిస్తుంది. కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చాలా కాలంగా ఆగిపోవడంతో ఈ మూవీపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా హీరోయిన్ అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకున్నారన్న వార్త గట్టిగా వినిపిస్తుంది. ఇదే విషయమై వాకబు చేయగా.. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని తెలిసింది. రాజమౌళితో టచ్ లో ఉన్న అలియా, ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలైన వెంటనే వచ్చి జాయిన్ అవుతారట. అలాగే ఆమె ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి చాలా ఆసక్తి చూపుతున్నారని కూడా తెలిసింది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ నుండి అలియా తప్పుకుందన్న వార్తలలో ఎటువంటి నిజం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు