దర్శకుడు పూరి జగన్నాధ్ తన సినిమాలలో మంచి హాస్యంతో కూడిన ఓ కామెడీ ట్రాక్ రాసుకుంటూ ఉంటారు. ఇక ఆయన ప్రతి సినిమాలో కమెడియన్ అలీ ఉంటారు, అలాగే ఆయన పాత్రను కూడా పూరి ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. సూపర్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాలలో అలీ చేసిన కామెడీ రోల్ తెరపై ఓ రేంజ్ లో పేలింది.
కాగా ప్రస్తుతం పూరి.. విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాలో కూడా అలీ కి ఓ స్పెషల్ కామెడీ రోల్ డిజైన్ చేశారట. 40 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో అలీ కూడా పాల్గొన్నాడట. ఇక విజయ్ దేవరకొండ మూవీలో కూడా అలీ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుందని తెలుస్తున్న సమాచారం. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపిస్తుండగా, బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.