రయ్ రయ్ అంటున్న శ్రీ, అక్ష

రయ్ రయ్ అంటున్న శ్రీ, అక్ష

Published on Oct 11, 2012 2:33 PM IST


శ్రీ మరియు అక్ష జంటగా నటిస్తున్న చిత్రం “రయ్ రయ్”. సుదీర్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి రామ క్ర్సిష్ణ మరియు ఎస్ ఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉండే ఒక అబ్బాయి జీవితాన్ని ఈ చిత్రంలో చూపించాము యాక్షన్ కామెడి పరంగా చిత్రం బాగుంటుంది అని తొలి షెడ్యూల్ ఈ మధ్యనే పూర్తి చేసుకున్న ఈ చిత్రం మలి షెడ్యూల్ ఈ నెల 12 న మొదలవుతుందని దర్శకుడు తెలిపారు. తిరుమల శెట్టి గిరీష్ కుమార్ అందించిన డైలాగ్స్ చిత్రానికి ఆకర్షణ అని శ్రీ వసంత సంగీతం యువతను ఆకట్టుకుంటుంది అని నిర్మాతలు తెలిపారు. శ్రీ గాథలో “ఈరోజుల్లో” చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నాడు . ఈ చిత్రానికి వెంకటప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు