ఫోటో మూమెంట్: అఖిల్ పెళ్లి కోసం చంద్రబాబుని ఆహ్వానించిన కింగ్ నాగ్

ఫోటో మూమెంట్: అఖిల్ పెళ్లి కోసం చంద్రబాబుని ఆహ్వానించిన కింగ్ నాగ్

Published on Jun 3, 2025 1:00 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా ఇపుడు లెనిన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం చూస్తున్న గ్యాప్ లోనే అఖిల్ సహా అక్కినేని కుటుంబం నుంచే ఫ్యాన్స్ కి మరో సాలిడ్ ట్రీట్స్ లభించాయి. వాటిలో అఖిల్ పెళ్లి కూడా ఒకటి. అయితే ఎట్టకేలకి అఖిల్ పెళ్ళికి భాజాలు మ్రోగాయి.

ఈ జూన్ 6న అఖిల్ తన లైఫ్ పార్టనర్ జైనబ్ ని పెళ్లి చేసుకోనుండగా అఖిల్ తండ్రి కింగ్ నాగార్జున పలువురు బిగ్ విగ్స్ ని ఈ పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు. మరి ఇలా ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించిన నాగార్జున ఇపుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఆహ్వానించిన విజువల్స్ వైరల్ గా మారాయి. ఇక నాగార్జున నుంచి కూలీ ఇంకా కుబేర సినిమాలు ఈ మూడు నెలల్లోనే రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు