ఫోటో మూమెంట్: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మరో హైలైట్ గా చై, శోభిత జంట

ఫోటో మూమెంట్: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మరో హైలైట్ గా చై, శోభిత జంట

Published on Jun 12, 2025 9:00 AM IST

రీసెంట్ గానే అక్కినేని వారి ఇంట మరో అతిపెద్ద శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. యంగ్ అండ్ డాషింగ్ హీరో అఖిల్ అక్కినేని ఇంకా తన భార్య జైనాబ్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగగా మొన్న ఆదివారం సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. మరి ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరై యువ జంటకి తమ శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందించారు.

అయితే ఈ రిసెప్షన్ లో అక్కినేని కుటుంబం అంతా కూడా కలిసి దిగిన పిక్స్ మంచి హైలైట్ గా నిలిచాయి. అయితే అఖిల్, జైనాబ్ జంటతో పాటుగా ఆ రిసెప్షన్ లో నాగ చైతన్య, శోభితల కపుల్ కూడా మంచి హైలైట్ గా నిలిచిన పిక్ ఇపుడు ఆకర్షణగా నిలిచింది. ఛార్మింగ్ లుక్స్ లో మంచి డ్రెస్సింగ్ లో కనిపించిన ఈ జంట కూడా ఇప్పుడు మరో హైలైట్ గా నిలిచారు.

దీనితో వీరి పిక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు నడుమ వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గా తండేల్ భారీ హిట్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండుతో ఓ సాలిడ్ థ్రిల్లర్ ని నాగ చైతన్య ఇప్పుడు చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు