‘అఖండ 2’ టీజర్‌తో బాలయ్య తాండవం మామూలుగా లేదుగా!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘అఖండ 2 – తాండవం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయిన ‘అఖండ 2’ టీజర్‌తో బాక్సాఫీస్‌ను బాలయ్య ఎలా ఉచకోత కోయబోతున్నాడో శాంపిల్ చూపెట్టాడు.

అయితే, ఈ టీజర్ కూడా రికార్డుల మోత మోగించింది. ‘అఖండ 2’ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఏకంగా 24 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. అంతేగాక, ఈ టీజర్‌కు 540K కి పైగా లైకులు రావడం మరో విశేషం. దీంతో టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా అఖండ-2 5వ స్థానంలో నిలిచింది. ఇంతటి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న టీజర్‌గా సీనియర్ హీరోల్లో బాలయ్య మరో రికార్డు అందుకున్నాడు.

బాలయ్య-బోయపాటి ఊరమాస్ కాంబినేషన్‌తో ఈ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగేలా చేసింది ఈ టీజర్. ఇక ఈ సినిమాకు థమన్ మరోసారి బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ అందిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version