గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మొదట పవన్ కళ్యాణ్ OGతో క్లాష్ అవ్వాలని అనుకున్నా, నిర్మాణంలో ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇక దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను రీసెంట్గా బాలకృష్ణ స్వయంగా డిసెంబర్లో విడుదలవుతుందని ప్రకటించారు.
అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ ఓజీ చిత్ర ప్రీమియర్ షోలో ‘అఖండ 2’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5, 2025న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఓ టీజర్‌ను OG ప్రింట్స్‌కు జతచేసి ప్రదర్శించారు. ఇక ఈ వార్త నందమూరి అభిమానులకు నిజంగా పెద్ద పండుగ కానుందని చెప్పాలి.
ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీనాథ్ అచంట భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.