‘Akhanda 2’ ఫస్ట్ రివ్యూ : బాలయ్య పూనకాలు, పైసా వసూల్ ఖాయమా..?

‘Akhanda 2’ ఫస్ట్ రివ్యూ : బాలయ్య పూనకాలు, పైసా వసూల్ ఖాయమా..?

Published on Dec 3, 2025 8:09 PM IST

Akhanda-2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2) డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయడంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఉమైర్ సంధు Akhanda 2 రివ్యూ :

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో భారీ చిత్రాలకు రివ్యూ ఇచ్చే ఓ క్రిటిక్, ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడైన ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ‘అఖండ 2’ చిత్రం పూర్తి పైసా వసూల్ చిత్రమని.. బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే సినిమా అని అన్నారు. అదిరిపోయే డైలాగులు, విజిల్స్ వేయించే క్లైమాక్స్ ఈ సినిమాలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

దీంతో ఈ సినిమా అభిమానుల ఆకలి తీర్చడం ఖాయమని ఆయన వెల్లడించారు. ఇక ఈ రివ్యూతో బాలయ్య అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. సంయుక్త హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు