‘అఖండ 2’ కూడా లాకయ్యింది.. ‘విశ్వంభర’ పరిస్థితేంటి?

‘అఖండ 2’ కూడా లాకయ్యింది.. ‘విశ్వంభర’ పరిస్థితేంటి?

Published on Jun 11, 2025 8:03 AM IST

మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ ఇపుడు ఎవరి దారిలో వారు భారీ సినిమాలు చేస్తూ మళ్ళీ ఫామ్ కొనసాగిస్తున్నారు. మెయిన్ గా బాలయ్య వరుస బ్లాక్ బస్టర్స్ తో ఇప్పుడు అఖండ పార్ట్ 2 ని కూడా రిలీజ్ కి లాక్ చేసేసుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అవైటెడ్ సినిమా నిజానికి అఖండ 2 కంటే ఎప్పుడో మొదలైన సినిమా “విశ్వంభర” అనివార్య కారణాలు రీత్యా ఆలస్యం కావాల్సి వచ్చింది.

అయితే ఎంతో లేట్ గా మొదలైన అఖండ 2 నే వచ్చేస్తుంది కానీ ఇదే ఫాంటసీ తరహాలో అనౌన్స్ అయ్యిన విశ్వంభర మౌనం కూడా వీడాల్సిన సమయం ఇక వచ్చింది అని చెప్పక తప్పదు. ఇతర భారీ సినిమాలు కూడా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసుకుంటున్నాయి కానీ ఇంకా విశ్వంభర నుంచి మౌనమే కనిపిస్తుండడంతో ఉన్న హైప్ ని తగ్గించుకున్నట్టు ఉంటుంది. సో మేకర్స్ ఇకనైనా త్వరపడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు