నవంబర్ 24న ఆట ఆరంభం ఆడియో

నవంబర్ 24న ఆట ఆరంభం ఆడియో

Published on Nov 22, 2013 6:30 PM IST

Nayanthara-with-Ajith-in-Aa
అజిత్ మరియు నయనతార నటించిన ‘ఆట ఆరంభం’ ఇటీవలే తమిళంలో విడుదలైన ‘ఆరంభం’ సినిమా తెలుగు అనువాద శీర్షికగా రానుంది. ‘పంజా’ సినిమాను తీసిన విష్ణు వర్ధన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాప్సీ మరియు ఆర్య కూడా నటించారు. జి శ్రీను బాబు తెలుగు వెర్షన్ అనువాదహక్కులను సొంతం చేసుకున్నాడు

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో నవంబర్ 24న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది. పలు ప్రముఖుల సమక్షంలో ఈ ఆడియోను భారీ రీతిలో నిర్వహించనున్నారు

అజిత్ చాలా స్టైలిష్ గా కనిపించిన ఈ సినిమాలో నయనతార చాలా హాట్ గా కనిపించి తమిళ ప్రేక్షకుల మదిని దోచింది. రానా దగ్గుబాటి ఒక ముఖ్య పాత్రను పోషించాడు. యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. డిసెంబర్ 6న సినిమా విడుదలకానుంది

తాజా వార్తలు