వెంకీ – చరణ్ సినిమాకి తాతయ్య దొరికేసాడు..

వెంకీ – చరణ్ సినిమాకి తాతయ్య దొరికేసాడు..

Published on Nov 21, 2013 6:00 PM IST

Rajkiran
విక్టరీ వెంకటేష్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఓ ఫ్యామిలీ డ్రామా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో వెంకటేష్, రామ్ చరణ్ తో పాటు మరో సీనియర్ నటుడికి కూడా స్థానం ఉంది. అదే వీరిద్దరికీ తాతయ్యగా కనిపించే పాత్ర.

ముందుగా ఆ పాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణ పేరుని పరిశీలించారు. అది సెట్ అవ్వలేదు. మేము విన్న తాజా సమాచారం ప్రకారం తమిళ్ యాక్టర్ రాజ్ కిరణ్ ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. రాజ్ కిరణ్ ‘పందెం కోడి’, ‘ముని’ సినిమాల ద్వారా మన తెలుగు వారికి పరిచయం ఉన్న నటుడే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది.

తాజా వార్తలు