అందాల సుందరి శ్రీదేవి తన నటనా జీవితాన్ని”ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రంతో తిరిగి మొదలు పెట్టనున్నారు. ఈ చిత్ర హిందీ వెర్షన్లో బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక చిన్న పాత్రలో కనిపించి అలరించనున్నారు. ఇదే పాత్రను తెలుగు మరియు తమిళ వెర్షన్లలో తమిళ స్టార్ అజిత్ చెయ్యనున్నారు. అమితాబ్ బచ్చన్ ఇంతక ముందెన్నడూ నేరుగా ఒక తమిళ చిత్రం చెయ్యలేదు. నిర్మాతలు తమిళంలో మరియు తెలుగులో అయన మొదటి చిత్రం చిన్న పాత్రలో కనిపించేది కాకూడదని అనుకున్నారు. కాబట్టి ఈ పాత్ర కోసం వారు అజిత్ ని అడిగారు అజిత్ కూడా ఒప్పుకున్నారు. అజిత్ మరియు శ్రీదేవి కలిసే సన్నివేశాన్ని వచ్చే వారం చిత్రీకరిస్తారు. ఈ చిత్రానికి ఆర్.బల్కి దర్శకత్వం వహిస్తున్నారు.