స్టార్ హీరో అజిత్ కి సంబంధించిన లీగల్ టీం ఒక విషయంపై స్పష్టత ఇచ్చారు. అజిత్ కి ఎటువంటి పేస్ బుక్ ఎటువంటి లేదని, ప్రచారం జరుగుతున్నట్లు అది అజిత్ అధికారిక అకౌంట్ కాదని ఓ లెటర్ విడుదల చేశారు. కొద్దిరోజులుగా హీరో అజిత్ అధికారిక పేస్ బుక్ అకౌంట్ అని ఓ ఖాతా ప్రచారంలోకి వచ్చింది. నిజమే అనుకోని కొందరు ఫ్యాన్స్ దాని అనుసరించడం మొదలుపెట్టారు. దీనితో అజిత్ కి సంబంచిందిన లీగల్ టీమ్ నోట్ విడుదల చేయడం జరిగింది.
ఇక అజిత్ ప్రస్తుతం వాలిమై చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు హెచ్ వినోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో అజిత్ స్వల్ప గాయాలపాలు కావడం జరిగింది. అజిత్ కోలుకొని మరలా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.