‘అఖండ 2’ రిలీజ్.. ఇదే జరగబోతుందా?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “అఖండ 2 తాండవం” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా ఇది కాగా తమ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అఖండ కి సీక్వెల్ గా వస్తున్న సినిమా ఇది కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ పక్కా క్లారిటీగా తాము ఈ సెప్టెంబర్ 25కే వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కానీ ఇంకోపక్క పవన్ ఓజి కూడా వెనక్కి తగ్గడం లేదు. అయినా అఖండ 2 మేకర్స్ కూడా కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు.

అయితే ఆ మధ్య అఖండ 2 గ్రాఫిక్స్ పనులు మూలాన వాయిదా పడితే పడొచ్చు అని వినిపించింది. మరి ఇదే జరగబోతుంది అన్నట్టుగా ఇపుడు టాక్. సినిమా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా అంటూ మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

Exit mobile version