ప్రభాస్ 20 పై కొనసాగుతున్న అదే బజ్.!

ప్రభాస్ 20 పై కొనసాగుతున్న అదే బజ్.!

Published on Jun 19, 2020 10:23 PM IST

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంపై గత కొన్ని రోజుల నుంచి సినీ వర్గాల్లో కొంత సస్పెన్స్ అలా కొనసాగుతూనే ఉంది. అలాగే ఈ చిత్రానికి గతంలో “ఓ రాధే” మరియు “రాధే శ్యామ్” అనే రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే.

కానీ వీటిలో మాత్రం “రాధే శ్యామ్” టైటిల్ నే చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యినట్టుగా బజ్ ఎక్కువగా వినిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఫస్ట్ లుక్ విషయంలో మాత్రం మరింత సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దాదాపు ఈ జూన్ నెలలోనే ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మరోసారి టాక్ వినిపిస్తుంది. ఈ నెల పూర్తి కావడానికి ఇంకా కొన్ని రోజులే ఉంది మరి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ నెలలోనే వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు