మన టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున ఒకపక్క సిల్వర్ స్క్రీన్ మరో పక్క స్మాల్ స్క్రీన్ పై కూడా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే..అయితే నాగ్ ఇప్పుడు హీరోగా చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు అసిహోర్ సాల్మోన్ తో చేస్తున్న యాక్షన్ అండ్ అడ్వెంచురల్ థ్రిల్లర్ చిత్రం “వైల్డ్ డాగ్” కూడా ఒకటి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.
అప్పుడు కోవిడ్ సమయంలో కూడా సాహసోపేత షూటింగ్ ను యూనిట్ నిర్వహించారు. కానీ కొన్ని రోజుల కితమే ఈ చిత్రం డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వడం ఖాయం అని టాక్ బయటకొచ్చింది. అది కూడా నిజమే అని సంకేతాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏమిటంటే మేకర్స్ మధ్య మళ్ళీ చర్చలు జరుగుతున్నాయట.
ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు సై అనడంతో వారు కూడా ఈ చిత్రాన్ని థియేట్రికల్ విడుదల చేసి ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు ఇవ్వనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ మరి ముందు ఇచ్చిన మొత్తం అయితే నెట్ ఫ్లిక్స్ అప్పుడు చెల్లించదని కూడా మరో వెర్షన్ వినిపిస్తుంది. మరి నాగ్ సినిమాకు ఏం జరగనుందో చూడాలి.