మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా వేసవి తరువాతే విడుదల చేస్తామని చిత్ర దర్శకుడు సుకుమార్ చెప్పాడు. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 16 నుండి మూడవ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. మే వరకు షూటింగ్ మొత్తం పూర్తి చేసి వేసవి తరువాత విడుదల చేస్తామని ఆయన చెప్పాడు. ఈ సినిమాకి ఆచార్య, చంద్రుడు అంటూ ఏవేవో టైటిల్స్ ప్రచారం జరిగాయి కానీ అవేవి కావు. ఒరిజినల్ టైటిల్ అనుకున్న తరువాత అధికారికంగా ప్రకటిస్తాము. కథా నాయికగా మొదటగా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు కానీ డేట్స్ అడ్జెస్ట్ అవక ఆమె స్థానంలో కృతి సాసన్ అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. మహేష్ ఈ సినిమాలో లెక్చరర్ పాత్ర చేయట్లేదని దర్శకుడు చెప్పాడు.