దర్శకుడు నాగ అశ్విన్ కొన్ని రోజుల క్రితం, ట్విట్టర్లో థియేటర్లలో మద్యం అనే ఐడియాని ట్విట్టర్ లో తన ఫాలోవర్స్ తో వ్యక్తపరిచారు. అశ్విన్ ఆలోచనకు ప్రతికూల స్పందన వచ్చింది. కాగా తాజాగా ఈ ప్రతిభావంతులైన దర్శకుడు నుండి ఈ రోజు కూడా కొత్త ఆలోచన వచ్చింది.
అశ్విన్ ట్వీట్ చేస్తూ.. ‘డ్రైవ్ – ఇన్ థియేటర్.. పాత రోజుల్లో టూరింగ్ టాకీలలాగా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారూ..?’ అని ఆయన తన ఫాలోవర్స్ ను అడిగారు. ఈ సారి కూడా, అశ్విన్ ఆలోచనకు మిశ్రమ స్పందన వస్తోంది. డ్రైవ్-ఇన్ థియేటర్ల ఆలోచన గురించి కొందరు అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ ‘ కొంతమంది ఆకతాయిలు ఇతరుల ‘అనుభవాన్ని కూడా పాడుచేయవచ్చు’అని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
https://mobile.twitter.com/nagashwin7/status/1261871780257398785