కరోనా వైరస్ భయాల మధ్య లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇటు కరోనా పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే.. అటు లాక్ డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని తన పిల్లలు మరియు భార్యతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ తన పిల్లలతో గడిపే సరదా సమయాన్ని ఫోటోల రూపంలోనో లేదా వీడియోల్లోనో బంధించి నమ్రత తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
కాగా తాజాగా మహేష్ ఓ ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. తన కుమారుడు గౌతమ్ తో టీవీలో వర్చువల్ టెన్నిస్ ఆట ఆడుతున్న వీడియోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ పోస్ట్ చేస్తూ.. “ప్రతి రోజు ఎక్కువగా ఇలాగే గడిచిపోతుంది. గేమ్ నైట్ విత్ గౌతమ్’ అని పోస్ట్ చేశారు.
https://www.instagram.com/p/B_C-YKpnOr-/