తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి హిందీ మరియు తమిళ భాషలలోకి రీమేక్ చేయడం బడింది. హిందీలో ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా ఒరిజినల్ తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా రూపొందించారు. తమిళంలో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఆదిత్య వర్మ పేరుతో విడుదలైంది. కాగా ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వద్ద అసిస్టెంట్ గా చేసిన గిరీశయ్య దర్శకత్వం వహించడం జరిగింది.
ఐతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలు మొదట దర్శకుడు బాల కి అప్పగించారు. చాలా భాగం షూటింగ్ జరిపిన తరువాత అవుట్ ఫుట్ పై సంతృప్తి చెందిన నిర్మాత ముఖేష్ మెహతా అతన్ని కాదని, గిరీశయ్యను నియమించుకున్నాడు. కాగా నిర్మాత ఇప్పుడు బాల తెరకెక్కించిన డార్క్ ఆదిత్య వర్మ వెర్షన్ కూడా విడుదల చేస్తాడట. ఈ మేరకు ఆయన తన అభిప్రాయం చెప్పడం సంచలనంగా మారింది. దీనితో తమిళంలో అర్జున్ రెడ్డి మూవీకి సంబంధించిన రెండు వెర్షన్స్ రానున్నాయన్నమాట.