పాపులర్ మ్యూజిక్ కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ జిఎం దయానంద్ గారు ఈ రోజు స్వర్గస్తులైనారు. గత కొన్ని నెలలుగా అయన కిడ్నీకి సంబందించిన సమస్యలతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. దయానంద్ గారు తన భార్య, కూతురితో కలిసి ఉంటారు.
ఫిల్మ్ నగర్ వర్గాల్లో బాగా పాపులర్ అయిన దయానంద్ గారికి మంచి వ్యక్తిగా కూడా పేరుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆదిత్య మ్యూజిక్ ని ఫిల్మ్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ లో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టడంలో ఆయన ఎంతో కృషి చేసారు.
ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ కుటుంభ సభ్యలకు వారి కుటుంబ సభ్యలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం.