అధినాయకుడు మళ్లీ వాయిదా పడనుందా?

అధినాయకుడు మళ్లీ వాయిదా పడనుందా?

Published on Apr 10, 2012 1:54 AM IST


నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అధినాయకుడు’ చిత్రం మళ్లీ వాయిదే పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎ సర్టిఫికేట్ దక్కించుకున్న ఈ చిత్రం ఈ వారం వచ్చే సూచనలు కనపడట్లేదు. ఈ చిత్ర నిర్మాత ఎమ్ఎల్ కుమార్ చౌదరి ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కోవడంతో ఈ సినిమా ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మరోసారి అదే ఆర్ధిక సమస్యలతో వాయిదా పడుతోంది. మొదటగా ఏప్రిల్ 13న విడుదలవుతుందని భావించినప్పటికీ ఏప్రిల్ 19 వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సలోని మరియు లక్ష్మి రాయ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకుడు.

తాజా వార్తలు