అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీ భూతం కబలించడం తెలిసిన విషయమే. కానీ వీటిని ఎదుర్కుని సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇప్పటికే చాలా చోట్లనుండి ఈ సినిమా పైరసీ లింక్ లను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు
కానీ ఇప్పటికి ప్రేక్షకులను మభ్యపెట్టే పనిలో కొన్ని తప్పుడు టొరెంట్ ల రుపంలో నెట్ లో హల చల్చేస్తున్నాయి. సమాచారం ప్రకారం వీటిని డౌన్ లోడ్ చేసుకుంటే ఒక కొత్తరకం వైరస్ సిస్టం కు పట్టే అవకాశాలు వున్నాయి.
కాబట్టి ఇలాంటి టొరెంట్ లకు దూరంగా వుండి సినిమాను హాల్ లోనే చూసి ఆనందిద్దాం