నైజాం బాక్స్ ఆఫీసుని షేక్ చేస్తున్న అత్తారింటికి దారేది

నైజాం బాక్స్ ఆఫీసుని షేక్ చేస్తున్న అత్తారింటికి దారేది

Published on Sep 30, 2013 10:15 AM IST

Attarintiki-Daredi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నైజాం బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ ఏరియాలో మొదటి వారం వీకెండ్ మాత్రమే 7.50 కోట్ల షేర్ ని క్రాస్ చేసింది. అలాగే మొదటి వారం ఎంతో సునాయాసంగా 12 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా సినీ అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తి చూపుతుండడంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ మరియు ఫుల్ కామెడీ ఉండటంతో సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు