యూఎస్ ప్రిమియర్ షో కలెక్షన్లలో రికార్డ్ సృష్టించిన ‘అత్తారింటికి దారేది’

యూఎస్ ప్రిమియర్ షో కలెక్షన్లలో రికార్డ్ సృష్టించిన ‘అత్తారింటికి దారేది’

Published on Sep 27, 2013 5:00 PM IST

AD

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా యూఎస్ఏలో ఇప్పటి వరకు వేసిన ప్రిమియర్ షోల అన్నింటిలో ఎక్కువ డబ్బును వసూలు చేసిన సినిమాగా రీకార్డ్ సృష్టించింది. ఈ సినిమా ప్రీమియర్ షో కి $ 345,000 యూఎస్ డాలర్లల రెమ్యునేషన్ ను కొల్లగొట్టింది. ఇది తెలుగు సినిమా ప్రీమియర్ షో లలోనే అతిపెద్ద రికార్డ్. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా సూపర్బ్ గా వుందని అంటున్నారు. ఈ సినిమా అన్ని ఏరియాలలో బాక్స్ ఆఫీసు కలెక్షన్ లను తిరగరాస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ అందించిన మంచి డైలాగ్స్ ని అన్ని రకాల ప్రేక్షకులు అభినందిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు