పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డు షేర్ కలెక్ట్ చేసిన మగధీర రికార్డ్స్ కి చేరువవుతోంది. ఈ రోజుటికి అత్తారింటికి దారేది వరల్డ్ వైడ్ షేర్ తో 67 కోట్ల మార్క్ ని టచ్ అయ్యింది. ఈ మూవీ మొత్తం షేర్ ‘మగధీర’ షేర్ కి దగ్గరగా 72-73 కోట్ల దగ్గర ఆగేలా ఉంది.
ఇప్పుడు కూడా అత్తారింటికి దారేది కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఏమిటంటే.. ‘అత్తారింటికి దారేది మగధీరని క్రాస్ చేస్తుందా?’. అత్తారింటికి దారేది ఇప్పటి వరకు చాలా రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చాలాకాలంగా నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతున్న మగధీర రికార్డ్స్ ని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? అత్తారింటికి దారేది మగధీర రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా? మీ సమాధానాల్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి.