అత్తారింటికి దారేది క్రేజ్ తో ఫాంలోకి వచ్చిన టాలీవుడ్

అత్తారింటికి దారేది క్రేజ్ తో ఫాంలోకి వచ్చిన టాలీవుడ్

Published on Sep 26, 2013 8:10 AM IST

attarintiki-daredi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఊహించని స్టార్ పవర్ గురించి చెప్పుకున్నా, అలాగే గత కొద్ది రోజులుగా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద సినిమాలు లేవు అని అనుకున్నా, మరోవైపు పైరసీ విషయంలో పబ్లిక్ నుంచి ఫుల్ సపోర్ట్ లబించిందని చెప్పుకున్నా. ఇవన్నీ నిన్నటి వరకూ జరిగాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకి క్రేజ్ మరియు అంచనాలు ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నాయి.

అత్తారింటికి దారేది వస్తున్న క్రేజ్ చూసి టాలీవుడ్ మళ్ళీ ఫాంలోకి వచ్చిందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే హీరో నితిన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో మాట్లాడి ఈ 27న జరగాల్సిన షూటింగ్ ని రద్దు చేసుకున్నారు. అలాగే స్టైలిస్ట్ నీరజ కోన కూడా 27న స్పెయిన్ వెళ్ళాల్సి ఉంది ఆమె కూడా పూరి జగన్నాథ్ ని రిక్వెస్ట్ చేసి తన షెడ్యూల్ ని మార్చుకుంది. చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు ఇలానే చేస్తున్నారు. వారందరూ మొదటి రోజు అత్తారింటికి దారేది సినిమా చూడాలనే ఇలా చేస్తున్నారు.

ఇప్పటికే బుకింగ్ లో కొన్ని రోజులకి టికెట్స్ అమ్ముడుపోయాయి. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి 27న భారీ ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు