ఆత్మహత్య చేసుకున్న జియా ఖాన్

ఆత్మహత్య చేసుకున్న జియా ఖాన్

Published on Jun 4, 2013 8:43 AM IST

Jiah-Khan

బాలీవుడ్లో వచ్చిన ‘గజినీ’, ‘నిశ్శబ్ద్’ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయిన హీరోయిన్ జియా ఖాన్ తనకు తనే ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న జియా ఖాన్ ఇంట్లో జరిగింది. ఈ 25 ఏళ్ళ హీరోయిన్ కి ముందు ముందు మంచి కెరీర్ ఉంది అలాగే ఇప్పటికే ఆమె తన లుక్స్, నటనతో, ప్రవర్తనతో అందరి నుండి ప్రశంశలు అందుకుంది.

ప్రస్తుతం జియా ఖాన్ ఎదుర్కొంటున్న పర్సనల్ ఇబ్బందులు, కెరీర్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల వల్లే ఆమె ఆత్మహత్యకి పాల్పడి ఉంటుందని సమాచారం. ఈ వార్త ఒక్క సారిగా ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. జియా ఖాన్ అసలు పేరు నఫీస ఖాన్. స్వతహాగా బ్రిటన్ లో పుట్టి పెరిగిన ఈ భామ 2007 లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ సందర్భంగా జియా ఖాన్ కి సంతాపం తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు