బండ్ల గణేష్, హరీష్ శంకర్ల మధ్య ఏం జరిగిందో తెలియదు గాని, సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది. ‘గబ్బర్‌సింగ్’ చిత్రయూనిట్ ను తలుచుకుంటూ హరీష్ శంకర్ విడుదల చేసిన లెటర్లో బండ్ల గణేష్ పేరు లేదు. అక్కడ మొదలైన వార్ బండ్ల గణేష్, హరీష్ శంకర్ పై రీమేక్ దర్శకుడు అంటూ, ‘విస్తరాకు’, ‘ఎంగిలాకు’ అంటూ కొన్ని కామెంట్స్ చేశారు.
కాగా తాజాగా బండ్ల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ హరీష్ శంకర్ ప్రస్తావన తీసుకువస్తే.. ఇక పై హరీష్ శంకర్‌తో సినిమాలు చేయను అంటూ బండ్ల చెప్పుకొచ్చారు. కాగా బండ్ల గణేష్ మహేష్ లేటెస్ట్ లుక్ పై ‘సర్.. మీరు హాలీవుడ్ స్టార్ హీరోలా ఉన్నారని ట్విట్టర్ లో మహేష్ ఫోటోతో పాటు కామెంట్ పెట్టిన సంగతి తెలిసిందే.