హీరోయిన్ గా యాక్షన్ కింగ్ కూతురు

హీరోయిన్ గా యాక్షన్ కింగ్ కూతురు

Published on Oct 12, 2012 8:30 AM IST


సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అర్జున్ నటించిన ‘జెంటిల్ మెన్’ మరియు ‘ఒకే ఒక్కడు’ చిత్రాల ద్వారా యాక్షన్కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జున్ తన వారసత్వాన్ని తన కూతురుకి ఇవ్వనున్నారు, అలా అని తను కూడా యాక్షన్ చేస్తుంది అని అనుకుంటే మాత్రం పప్పులో కాలిసినట్టే. అర్జున్ కూతురి పేరు ఐశ్వర్య. ఆమె విశాల్ హీరోగా త్వరలో ప్రారంభం కానున్న ‘పట్టతు యానయ్’ అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయం కానున్నారు.

ఈ చిత్రంలో ప్లస్ 2 చదివే అమ్మాయి పాత్రలో ఐశ్వర్య కనిపించనుంది. ఐశ్వర్య విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ చేసారు. ఈ చిత్ర చిత్రీకరణ నవంబర్ 5 నుంచి మొదలవుతుంది. తన మొదటి సినిమాలో ఐశ్వర్య నటన ఎలా ఉండబోతుండా అనే దానికోసం మరి కొంత కాలం వేచి చూడాలి. అర్జున్ నటనని మెచ్చుకున్న ప్రేక్షకులు ఈమె నటను ఎంతవరకూ ఆదరిస్తారో చూడాలి.

తాజా వార్తలు