యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన 5 దశాబ్దాల కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసారు, అలాగే ఆయన మొత్తం జీవితాన్ని సినిమాకే అంకితం చేసారు. సినీరంగంలో ఆయన పేరు లేకుండా చెప్పలేం. ప్రస్తుతం కమల్ హాసన్ కుమార్తెలైన శృతి హాసన్, అక్షర హాసన్ లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఇటీవలే కమల్ హాసన్ తన కుమార్తెల గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ‘ నేను ఎప్పుడూ నా కుమార్తెలకు ఎలా నటించాలో చెప్పలేదు ఎందుకంటే నటన అనేది వారి జీన్స్ లోనే ఉందని నేను బలంగా నమ్ముతాను. చాలా అరుదైన సమయాల్లో నటన గురించి కొన్ని టిప్స్ చెప్పడమే తప్ప, వారి సినిమాల్లో నేను కల్పించుకోను. సినిమాల ఎంపిక విషయంలో వారికి పూర్తి ఫ్రీడం ఇచ్చాను. వారి జీవితానికి సంబందించినది కాబట్టి వారి జడ్జ్ మెంట్ ని నేను నమ్ముతాను. నాకంటే వారికి ఏది బెస్ట్ అనేది వారికే తెలుస్తుందని’ కమల్ ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో అన్నారు.
ప్రస్తుతం కమల్ హాసన్ విశ్వరూపం 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీలో విడుదల కానుంది. ఈ మూడు వెర్షన్స్ ని ఆరో 11.1 సౌండ్ సిస్టం తో మిక్స్ చేస్తున్నారు. ‘ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ పలు ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ సెకండ్ పార్ట్ విషయంలో అలా జరగదని ఆశిస్తున్నానని’ కమల్ హాసన్ అన్నారు. ఈ సినిమాలో కమల్ నటించడమే కాకుండా కథ, దర్శకత్వం, సహా నిర్మాతగాగా కూడా వ్యవహరించాడు.