విలక్షణమైన నటన, విభిన్నమైన సంభాషణల రచన, వింతమాటకారితనం. ఇవన్నీ కలిస్తే తనికెళ్ళ భరణి. ఆయన రేడియో మిర్చికి ఇచ్చిన ఇంటర్వ్యూలో డబ్బుకు సంభందించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలిపారు.
“డబ్బు మీ కాళ్ళకు సరిపడే చెప్పులాంటిది. మీకేంత కావాలో అంతే వుంటే ఉత్తమం. మనకాళ్ళకు తప్పుడు చెప్పులు తొడిగినట్టు డబ్బు ఎక్కువైనా, తక్కువైనా కూడా భాదే. ఈరోజుల్లో ఎవరూ తమ భార్యా బిడ్డల కోసం డబ్బును సంపాదించడంలేదు. తమ మనవలు, మునిమనవలు కోసం కూడబెడుతున్నారు. అదే ఈ అనర్ధాలకు మూలం” అని తెలిపారు.
ఈయన త్వరలో సునీల్ తో ‘భక్త కన్నప్ప’ సినిమాని తియ్యనున్నారు. ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయనకు కావలసినంత తాత్విక మేధస్సు వుందని అనిస్పిస్తుంది కదూ …