నిన్న జరిగిన ఓ బాధాకరమైన సంఘటన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని 90 నిమిషాలు లీక్ అయ్యింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదొక వార్నింగ్ కాల్ లాంటిది. ఈ సంఘటనతో టాలీవుడ్ అన్ని కంట్రోల్స్ పై దృష్టి పెట్టింది.
ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ వారు ఈ డేటాని స్టోర్ చెయ్యడం మరియు ట్రాన్ఫర్ లాంటి పనులను చాలా ఈజీగా చేస్తూ ఉంటుంది. అలాగే థర్డ్ పార్టీ ఎయిన ఎడిటింగ్ కంపెనీలు కూడా సినిమాకి సంబందించిన ట్రైలర్స్, టీజర్స్ ని అందరికీ పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ మధ్య సీక్రెట్ గా ఉంచాల్సిన డిజిటల్ కంటెంట్ చాలా మందికి వెళుతోంది. ఇలా ఎక్కువ మందికి పంపడం వల్ల సినిమాని ముందే లీక్ చెయ్యడానికి, పైరేట్ సీడీలు చెయ్యడానికి వీలవుతోంది.
ఈ షాకింగ్ సంఘటన వల్ల ఏపి ఫిల్మ్ చాంబర్ పోలీసుల సాయంతో ఎంతో ఎఫ్ఫెక్టివ్ గా అన్ని పనులు తమ కంట్రోల్ లో ఉంచుకునే ప్లాన్ చేస్తోంది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఏపి ఫిల్మ్ చాంబర్ యాంటి పైరసీ మెంబర్ తెలియజేశాడు.
ఇకనుంచి టాలీవుడ్ లో యాక్సెస్ కంట్రోల్స్ టఫ్ గా తయారవనున్నాయి. ఎవరైతే డిజిటల్ కంటెంట్ ని హ్యాండిల్ చేస్తారో వారిని ఇక నుంచి పర్యవేక్షిస్తుంటారు. టాలీవుడ్ లో ఇలాంటి సంఘటన ఇది మొదటి సారి అలాగే చివరి సారి అవ్వాలని ఆశిద్దాం..