తన తల్లిదండ్రులెవరో తెలుసుకునే ప్రయత్నంలో మహేష్ చేసిన ఎడ్వెంచర్ల రూపంలో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ సినిమా ఈ మధ్య టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినా ‘ఎ’ సెంటర్ ప్రేక్షకులు ఈ సినిమాను చాలా ఆదరించారు. ముఖ్యంగా అమెరికాలో మిలియన్ డాలర్ల సినిమాగా చరిత్ర సృష్టించింది
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను హిందీలో రీ మేక్ చేయ్యనున్నారని, దానికి హీరోగా ఆమీర్ ఖాన్ ను సంప్రదించారని సమాచారం. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు. ఆమీర్ నటించిన ‘గజినీ’ సినిమా రిమేక్ అయినప్పటికీ అక్కడ భారీ విజయం సాధించింది. తన గత చిత్రం ధూమ్ 3 కలెక్షన్ల వర్షం కురిపించింది
ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. కృతిసనన్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్. 14రీల్స్ ఎంటెర్తైంమెంట్స్ సంస్థ నిర్మాత.