సుధీర్ బాబు నటించిన ‘ఆడు మాగాడ్రా బుజ్జీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ‘ప్రేమ కధా చిత్రమ్’ వంటి ఘన విజయం తరువాత సుధీర్ కు ఇదే తదుపరి చిత్రం. ఈ సినిమాకు కృష్ణ రెడ్డి గంగదాసు దర్శకుడు. అస్మితా సూద్ మరియు పూనమ్ కౌర్ హీరొయిన్స్
గత నెల ఆడియో ను విడుదల చేసిన ఈ చిత్ర బృందం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వున్నారు. వచ్చేవారం ఈ సినిమా సెన్సార్ కు వెళ్లనుంది. నవంబర్ 29 న విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.
ఈ సినిమా టైటిల్ ఆడు మాగాడ్రా బుజ్జీ నటించిన ‘అతడు’ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ఒక పాటలో సుదీర్ చాలా రోజులుగా కష్టపడి సాధించిన సిక్స్ ప్యాక్ ను చుపించానున్నాడు. శ్రీ సంగీత దర్శకుడు. ఎస్.ఎన్ రెడ్డి, సుబ్బారెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు