రష్యన్ భామతో రొమాన్స్ చేయనున్న ఆది

రష్యన్ భామతో రొమాన్స్ చేయనున్న ఆది

Published on Mar 19, 2014 12:05 AM IST

Russian-beauty

క్రిష్టినా అఖీవా అనే రష్యన్ భామతో త్వరలో ఆది గాలిపటం సినిమాలో జోడి కట్టనున్నాడు. గాబ్రియాలా, మార్యం జాకారియా, నికోలే మాదేల్, స్కార్లెట్ విల్సన్ ల తరువాత ఇప్పుడు క్రిష్టినా అఖీవా తెలుగు సినిమాలో మెరవనుంది

ఈ భామ రష్యాలో పుట్టినా పెరిగింది మాత్రం ఆస్ట్రేలియాలోనట. ఇక్కడకు వచ్చేముందు మోడలింగ్ లో శిక్షణ తీసుకుంది. ఈ భామ గతంలో సన్నీ డియల్ సరసన యమ్ల పగ్లా దీవానా 2 సినిమాలో నటించింది . ఈ బృందం చాలా సహాయంచేస్తుందని, వీరితో పనిచేయడం చాలా ఆనందకరమని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది

ఈ సినిమాకు నవీన్ దర్శకుడు. సంపత్ నంది నిర్మాత. ఎరికా ఫెర్నాండెజ్ ఒక నాయిక. రాహుల్ రవీంద్రన్ ముఖ్యపాత్రధారి.

తాజా వార్తలు