ఈ “బిగ్ బాస్” హిట్ జంట నుంచి వెబ్ సిరీస్.!

ఓవరాల్ వరల్డ్ టెలివిజన్ లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. ప్రపంచ ఎన్నూ భాషల్లో సూపర్ హిట్టయిన ఈ షో మన తెలుగులో కూడా భారీ రెస్పాన్స్ ను అందుకుంది. అయితే మన తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్స్ అయ్యాయి వీటి నుంచి చాలా మందికే మంచి గుర్తింపు వచ్చింది.

అయితే గడిచిన లాస్ట్ సీజన్ బిగ్ బాస్ 4 లో అఖిల్ మరియు మోనాల్ గజ్జర్ ల జంట మధ్య కెమిస్ట్రీ ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. మరి ఇప్పుడు ఏకంగా ఈ ఇద్దరు ఒక ఒక వెబ్ సిరీస్ నే చేసేస్తున్నారు. దానికి సంబంధించి టైటిల్ మరియు పోస్టర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది.

ఈ చిత్రానికి “తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి” అనే టైటిల్ ను కూడా ఇద్దరి నేటివిటీకి తగ్గట్టు పెట్టేసారు. మరి అలాగే ఈ వెబ్ సిరీస్ ను భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తుండగా సరస్వతి క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

Exit mobile version