“వకీల్ సాబ్”లో ఓ స్పెషల్ సీన్ కూడా.!

“వకీల్ సాబ్”లో ఓ స్పెషల్ సీన్ కూడా.!

Published on Feb 2, 2021 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చాలా కాలం అనంతరం స్టార్ట్ చేసిన కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సింది పరిస్థితుల వల్ల ఏకంగా సంవత్సరం లేట్ గా వస్తుంది. అయితే ఈ చిత్రం బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తీస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాను తక్కువ సమయంలోనే ముగించేసే పనిలో పడ్డా ఆ సమయంలోనే అప్డేట్స్ కూడా త్వరగా ఇవ్వడమే స్టార్ట్ చేశారు. అంతే కాకుండా మన నేటివిటీకి చాలానే మార్పులు చేసి కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు. అయితే మరి దర్శకుడు శ్రీరామ్ వేణు మాత్రం పర్టికులర్ గా ఓ సీన్ ను హైలైట్ చేసి చెప్తున్నారు.

లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ సీన్ థియేటర్స్ లో పేపర్స్ ఎగరేసే రేంజ్ లో ఉంటుంది అని చాలా ఎగ్జైటింగ్ గా చెప్తున్నారు.మరి ఆ సీన్ ఏంటో తెలియాలి అంటే వచ్చే ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు