ట్యూన్స్ కంపోజ్ చెయ్యడంలో ఏ ఆర్ రెహమాన్ కంటూ ప్రత్యేకమయిన శైలి ఉంది. ఈయన కంపోజ్ చేసే విధానంలో ఒక రకమయిన విప్లవం తీసుకోచ్చారనే చెప్పాలి చాలా కాలం పాటు ఈయన పలు తమిళం మరియు హిందీ చిత్రాలకు లండన్ నుండే పని చేశారు. ట్యూన్ సిద్దం అవ్వగానే అయన దాన్ని ఇక్కడ చెన్నైలో బృందానికి రికార్డింగ్ కోసం మెయిల్ చేస్తారు. ఇప్పుడు మణిరత్నం మరొక ఆసక్తికరమయిన విషయం చెప్పారు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మణిరత్నం ఇలా చెప్పారు ” అయన ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఫ్లైట్ లో ట్యూన్ కంపోజ్ ఎలా చేస్తారో నాకు అర్ధం కావట్లేదు” అని అన్నారు. ఏ ఆర్ రెహమాన్ “కడల్” చిత్రంతో పన్నెండవసారి మణిరత్నంతో కలిసి పని చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి “కడలి” పేరుతో డబ్ చేస్తున్నారు. గౌతం కార్తీక్, తులసి నాయర్, అర్జున్, అరవింద్ స్వామి మరియు లక్ష్మి మంచు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 1న విడుదల కానుంది.