అక్షయ్ కుమార్ తో చిత్రం చెయ్యనున్న మురగదాస్

అక్షయ్ కుమార్ తో చిత్రం చెయ్యనున్న మురగదాస్

Published on Nov 20, 2012 4:27 AM IST


ఏ ఆర్ మురగదాస్ తాజా చిత్రం “తుపాకి” చిత్ర విజయంతో మేఘాల్లో తేలిపోతున్నారు. విజయ్,కాజల్ మరియు విద్యుత్ కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం ఆరు రోజులకు కాను 45 కోట్లను వసూలు చేసింది. తెలుగు ఈ ఏడాది విజయం సాదించిన అతి తక్కువ డబ్బింగ్ చిత్రాలలో ఇది ఒకటి అయ్యింది. ఇదిలా ఉండగా కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మురగదాస్ హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చెయ్యనున్నారని తెలుస్తుంది. హిందీ మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కించాలని మురగదాస్ అనుకున్నా అక్షయ్ కుమార్ డేట్స్ దొరకకపోవడంతో విరమించుకున్నారు. కాజల్ పాత్రలో పరినీతి చోప్రా కనిపిస్తుండగా ఈ చిత్రాన్ని విపుల్ షా నిర్మించనున్నారు. డిసెంబర్లో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. గతంలో మురగదాస్ ,అమీర్ ఖాన్ “గజినీ” చిత్రంతో బాలీవుడ్లో విజయం దక్కించుకున్నాడు.

తాజా వార్తలు